యాసంగికి సరిపడా యూరియా అందించాలి

యాసంగికి సరిపడా యూరియా అందించాలి కాకతీయ, దుగ్గొండి: రైతులకు యాసంగి పంటకు సరిపడ యూరియాను అందించాలని వరంగల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దుగ్గొండి తహసీల్దార్ రాజేశ్వర్ రావు కు వినతి పత్రం అందించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతాంగానికి ఖరీఫ్ సీజన్లో యూరియా సరిపడ అందించక, పంటలకు సరియైన సమయంలో యూరియా వేయకపోవడంతో పంట దిగుబడి తగ్గిందని అన్నారు. అందువలన వచ్చే యాసంగి సీజన్ కు రైతులందరికీ సరిపడ యూరియాను అందించాలని, ఎలాంటి షరతులు లేకుండా...