బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి
హుజురాబాద్‌లో బీసీ జేఏసీ సమావేశం కాకతీయ, హుజురాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని హుజురాబాద్ బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హుజురాబాద్ పట్టణంలోని బీఎస్ఆర్ గార్డెన్స్‌లో బీసీ జేఏసీ నేత చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందేల వెంకన్న కన్వీనర్‌గా వ్యవహరించారు. సమావేశంలో పాల్గొన్న బీసీ జేఏసీ అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఇటీవల క్యాబినెట్ పాత రిజర్వేషన్...