యూరియా కొరత రానీయొద్దు

యూరియా కొరత రానీయొద్దు కాకతీయ, నల్లబెల్లి: మండల వ్యవసాయ అధికారికి జిల్లా రైతు సంఘం నేతృత్వంలో బుధవారం మెమోరాండం సమర్పించారు. వర్షాకాలంలో పత్తి, వరి పంటలకు సరిపడా యూరియా అందక రైతులు భారీ నష్టాలు చవిచూశారని ఉపాధ్యక్షుడు కడియాల వీరాచారి తెలిపారు. రాబోయే రబీ సీజన్లో వరి, మొక్కజొన్న పంటలకు కావలసినంత యూరియాను ముందుగానే నిల్వ ఉంచాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం లింక్ పెట్టి అవసరం లేని మందులను బలవంతం చేసే పద్ధతిని నిలిపివేయాలని కోరారు. బిల్లుల సమ్మె, సీసీఐ కొనుగోలు నిలిచిపోవడంతో...