కాంగ్రెస్ పాలనలో ప్రతీ కుటుంబానికి భరోసా
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కాకతీయ పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవార ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతీ కుటుంబం భరోసా పొందేలా, అవసర సమయంలో ప్రభుత్వం అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా చికిత్స ఖర్చులు, ప్రమాదాలు, లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో...