అక్రమ పట్టా రద్దు చేయాలి
అక్రమ పట్టా రద్దు చేయాలి పేదలకు పట్టాలు ఇవ్వాలి కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర నాగారం రెవెన్యూ శివారు సర్వే నం. 109/ఏ/ఈలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పుల్యాల వసంత పేరుతో అక్రమంగా పట్టా మంజూరు చేయడంపై సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేసి, భూమిలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ములుగు కలెక్టర్...