గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ : గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు స్వయంగా పాల్గొని గ్రామాలు ప్రగతి పథంలో నడవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మానకొండూర్ మండలం శంషాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యమే అభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామస్థుల అవసరాలకు అనుగుణంగా చేపట్టే పనుల్లో ప్రజలు సక్రియంగా పాలుపంచుకుంటేనే పనుల్లో నాణ్యత పెరుగుతుందన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో జరిగే కార్యాచరణపై...