వయోవృద్ధుల పోషణ చట్టం కఠినంగా అమలు
కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం జిల్లాలో పకడ్బందీగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్టోబర్ 1న ఎన్నికల షెడ్యూల్ కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని వృద్ధులకు...