భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ సందర్శనం
భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ సందర్శనం కాకతీయ, వేములవాడ : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ప్రభుత్వం విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రి కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. తదుపరి ఆలయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్...