నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు
నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు మిల్లర్లకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చరిక రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నిబంధనలు పాటించే రైస్ మిల్లర్లకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆశించిన...