విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు వైద్యధికారి మానస కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఒత్తిడిని జయించాలని, మానసిక ఒత్తిడికి గురికావద్దని వైద్యాధికారి మానస అన్నారు. గురువారం మండలంలోని కేజీబివి పాఠశాలలో మానసిక ఒత్తిడిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తే ప్రగతి సాధిస్తారన్నారు. విద్యపైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడి జయించాలంటే యోగా, ధ్యానం తోపాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివితే మంచి స్ధాయికి...