వృథాగా పోతున్న పెద్దచెరువు నీరు
వృథాగా పోతున్న పెద్దచెరువు నీరు తూములను పర్యవేక్షించని నీటిపారుదల శాఖ అధికారులు కాకతీయ,పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలంలోని గట్లకుంట గ్రామంలోని పెద్ద చెరువు తూము నుంచి నీరు వృధాగా పోతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తులో నీటి గండం తప్పదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురియడంతో చెరువుకు జలకళ ఉట్టిపడుతున్నది. చెరువు నిండుగా ఉండడంతో ఆయకట్టు రైతులకు నీటి తిప్పలు తప్పాయి. అంతే కాకుండా పరిసర ప్రాంత...