కరీంనగర్‌లో చలి జోరు స్వెటర్ల ధరలు ఉరకలు
కరీంనగర్‌లో చలి జోరు స్వెటర్ల ధరలు ఉరకలు ప్రజలు కొనుగోలుకు ఇబ్బంది కాకతీయ, కరీంనగర్: జిల్లాలో చలిగాలులు ఊపిరి బిగపట్టిస్తున్నాయి. రాత్రిపూట, తెల్లవారుఝామున ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వీధులకే చలి వణుకు వచ్చింది. ఈ పరిస్థితి నేపథ్యంలో మార్కెట్లలో వింటర్ వేర్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. అయితే చలి పెరిగినంతగా ధరలు కూడా ఎగబాకడం సామాన్యులకు కొత్త సమస్యగా మారింది.నగరంలోని తెలంగాణ చౌక్, మార్కెట్ ఏరియా, పలు పరిసరాల్లో తాత్కాలికంగా ఏర్పాటైన స్వెటర్ బజార్లు కిటకిటలాడుతున్నాయి. చిన్నారుల స్వెటర్లు గతేడాది ₹250–₹350 ఉంటే ఈసారి...