బీసీ,ముస్లిం వర్గాల హక్కులు కాపాడండి
వర్గీకరణ వెంటనే అమలు చేయాలి బీసీ సంఘాల డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : బీసీ వర్గీకరణను తక్షణమే అమలు చేసి, బీసీ–ముస్లిం ఉపవర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆల్ బీసీ మైనారిటీస్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు శుక్రొద్దీన్ భాష, తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఉన్న ఉపకులాలు, ముఖ్యంగా ముస్లిం...