సీఎం పర్యటన ఏర్పాట్టపై కలెక్టర్ పరిశీలన
కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పురోగతిపై శుక్రవారం కలెక్టర్ జితేష్ పాటిల్ సమీక్షించారు. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా తీర్చిదిద్దే పనుల్ని కలెక్టర్ విభాగాల వారీగా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆడిటోరియం, హాస్టల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లు, అంతర్గత రహదారుల మరమ్మతు వంటి కీలక ప్రదేశాలను సందర్శించి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ యూనివర్సిటీ అధికారుల...