మెరుగుపడిన ఆర్టీఏ ట్రాక్
‘కాకతీయ’ కథనంతో స్పందించిన అధికారులు పిచ్చిమొక్కల తొలగింపు, మురుగునీటి గుంతల పూడ్చివేత కాకతీయ, వరంగల్: వరంగల్ ఆర్టీఏ ట్రాక్ బాగుపడింది. మొన్నటి వరకు ట్రాక్ నిండా బురద, చుట్టూ అడవిని తలపించేలా ఉన్న మొక్కలను శుక్రవారం ఆర్టీఏ అధికారులు తొలగించారు. కాకతీయ దినపత్రికలో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆర్టీఏ అధికారులు ట్రాక్ ను కాసింత మెరుగుపరిచారు. వాస్తవానికి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్టీఏ ఆఫీసులో టెస్ట్ డ్రైవింగ్ నిర్వహిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా రోడ్డు...