కాకతీయ ఎఫెక్ట్..సెల్లార్ దందాపై కమీషనర్ సీరియస్
కాకతీయ ఎఫెక్ట్..సెల్లార్ దందాపై కమీషనర్ సీరియస్ 17 భవనాలకు నోటీసులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో సెల్లార్ల దుర్వినియోగం పై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ చర్యలు చేపట్టారు. ఈ నెల 20 తేదీ (మంగళవారం) రోజున కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన సెల్లార్‌ల్లో వ్యాపారాలు, భవన యజమానుల అత్యాశ శీర్షికపై మున్సిపల్ యంత్రాంగం స్పందించింది. పౌర సమస్యను ప్రాధాన్యంగా తీసుకున్న కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శనివారం నగరంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు కమర్షియల్ భవనాల్లో...