ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ నియామకం

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ నియామకం. పార్టీ బలోపేతానికి హైకమాండ్ కీలక నిర్ణయం కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి పైడాకుల అశోక్‌ను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలో పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దూసుకుపోవడానికి ఈ నిర్ణయం కీలకమైందిగా రాజకీయంగా విశ్లేషిస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో పాటు,...