తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత కలకలం
తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత కలకలం ఇసుక మాఫియా పనేనా..? రైతుల్లో ఆగ్రహావేశం కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వాగుపై నిర్మించిన మానేరు చెక్‌డ్యామ్‌ను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామాలన్నీ ఒక్కసారిగా కలవరపడ్డాయి. చెక్‌డ్యామ్‌ను నిశితంగా కూల్చివేయడం వెనుక అక్రమ ఇసుక మాఫియా కుట్రే ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనుగుల వాగులో కొంతకాలంగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకే ఈ చెక్‌డ్యామ్ అడ్డుకట్ట వేస్తోందని, ఈ అడ్డంకిని తొలగించుకునేందుకు రాత్రి వేళల్లో...