శిశుమందిర్‌లో విద్య, విలువల అవగాహన కార్యక్రమం
శిశుమందిర్‌లో విద్య, విలువల అవగాహన కార్యక్రమం కాకతీయ, కరీంనగర్ : శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆచార్యుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న నేత్రవైద్య నిపుణులు డా. చిట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో సంస్కారం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో వివరించారు. విద్యార్థుల చదువులో తల్లిదండ్రుల సహకారం విజయానికి పునాది అవుతుందని చెప్పారు.అతిథిగా హాజరై మాట్లాడిన ఎలగందుల సత్యనారాయణ శిశుమందిరాలు విద్యతో పాటు విలువల పెంపుకి...