మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం

మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం రైతుల్లో ఆందోళన మూడు కోట్ల నష్టం పోలీసులు విచారణలోకి పలు పార్టీ నాయకుల సందర్శనలు. కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీరాంపూర్ మండలం తనుగుల శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ అనుమానాస్పదంగా ధ్వంసమై ప్రాంతంలో కలకలం రేగింది. నవంబర్ 21 రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ ఏఈ పాలకుర్తి రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. దాదాపు 90 మీటర్ల మేర కూలిన ఈ చెక్‌డ్యామ్ వల్ల సుమారు వెయ్యి...