కరీంనగర్‌లో అసైన్డ్ భూముల కబ్జాపై ఏఐఎఫ్‌బీ ఆగ్రహం

కరీంనగర్‌లో అసైన్డ్ భూముల కబ్జాపై ఏఐఎఫ్‌బీ ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ : జ్యోతిస్మతి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం కబ్జా చేసిన తిమ్మాపూర్–నుస్తులాపూర్ అసైన్డ్ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు డిమాండ్ చేశారు.కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు పిర్యాదు సమర్పించారు. 574, 576 సర్వే నంబర్లలోని 19 ఎకరాల భూమి విలువ 70 కోట్లు దాటుతుందని, 2007లోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని అధికారులు ఇంకా రిలీజ్ చేయకపోవడం నిర్లక్ష్యమని నేతలు...