క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ కంపెనీలోని వివిధ డిపార్ట్మెంట్ల వద్ద సింగరేణి సెక్యూరిటీ గార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించినప్పుడే గుర్తింపు లభిస్తుందని సింగరేణి సెక్యూరిటీ మేనేజర్ మేనేజర్ ఎండి.జాకీర్ హుస్సేన్ తెలిపారు. కొత్తగూడెం ఎస్ అండ్ పిసి ట్రైనింగ్ సెంటర్ నందు ఆరు రోజులపాటు జరిగే 14వ బ్యాచ్ జమేదార్ల పున:శ్చరణ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యమన్నారు. మనం క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నపుడే...