విద్యార్థినిలపై చేయి చేసుకున్న ఉపాధ్యాయురాలు

విద్యార్థినిలపై చేయి చేసుకున్న ఉపాధ్యాయురాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే ఓ ఉపాధ్యాయురాలు ఏకంగా విద్యార్థినిలపై చెయ్ చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలు తన బంగారు ఆభరణం కనిపించకపోవడంతో నలుగురు విద్యార్థినిలపై అనుమానం వ్యక్తం చేస్తూ మందలించారు. నలుగురు విద్యార్థినిలపై తీవ్ర కోపంతో ఉపాధ్యాయురాలు చెయ్ చేసుకోవడంతో గాయాలయ్యాయి. ఆదివారం విద్యార్థినీలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలపడంతో ఉపాధ్యాయురాలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ...