కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలో మండల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.కష్ట కాలంలో మన వెంబడి ఉన్నవారే మనవరన్నారు.ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గుడి చేతిలో పడి నాశనం అయిందని, యూరియా కొరత వచ్చింద్ధాంటే ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనేనని,కెసిఆర్ హయంలో రాజుగా బ్రతికిన రైతులు...