ప్రేమవివాహం చేసుకున్న కూతురిని బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులు
ప్రేమవివాహం చేసుకున్న కూతురిని బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులు కాకతీయ, జగిత్యాల : మల్యాలలో ప్రేమవివాహం పెద్ద హంగామాకి దారి తీసింది. మల్యాలకు చెందిన ముత్తు కుమార్, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మాధవి వారం క్రితం కొండగట్టులో ప్రేమపెళ్లి చేసుకున్నారు. కుటుంబ అనుమతి లేకుండా జరిగిన ఈ వివాహం మాధవి ఇంటివారికి తీవ్ర అభ్యంతరం కలిగించింది.ఈ నేపథ్యంలో మాధవి తల్లిదండ్రులు, బంధువులు భారీగా ముత్తు కుమార్ ఇంటికి చేరుకుని ఘర్షణకు పాల్పడ్డారు. అక్కడ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ముత్తు కుమార్ కుటుంబ సభ్యులపై దాడి...