బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు
బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు బండి సంజయ్ బంపర్ ఆఫర్ కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భారీ ఆఫర్ ప్రకటించారు. బీజేపీ సూచించిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే,ఆ గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు కేటాయిస్తానని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదని తెలిపారు.కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గతంలో బీఆర్ఎస్ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని...