కరీంనగర్ నగరపాలక సంస్థపై బిఆర్ఎస్ పార్టీ ముట్టడికి సిద్ధం

కరీంనగర్ నగరపాలక సంస్థపై బిఆర్ఎస్ పార్టీ ముట్టడికి సిద్ధం కాకతీయ, కరీంనగర్ : నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించనున్నది. మంకమ్మతోట 37వ డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించారు.వీధుల్లో కుక్కలు, కోతులు, రోడ్లలో గుంతలు, ధూళి దుమ్ముతో నగర పరిస్థితి దారుణంగా ఉందని బిఆర్ఎస్ నేతలు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నగరపాలక సంస్థ పనులు నిలిచిపోతున్నాయని, ప్రభుత్వం ప్రజల సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని...