బ్రహ్మోత్సవాల ఊరేగింపులో విద్యుత్ షాక్‌తో చిన్నారి దుర్మరణం
బ్రహ్మోత్సవాల ఊరేగింపులో విద్యుత్ షాక్‌తో చిన్నారి దుర్మరణం జగిత్యాల జిల్లా లో హృదయ విదారక ఘటన కాకతీయ, జగిత్యాల : కోడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు విషాద వాతావరణంలో ముగిశాయి. మూడు రోజులుగా వైభవంగా సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో దుర్ఘటన చోటు చేసుకుంది.నాగరాజు,మమత దంపతుల కుమార్తె మధుశ్రీ (11) నృత్యాలు, కోలాటాల్లో ఆనందంగా పాల్గొంటుండగా ఊరేగింపు మార్గంలోని విద్యుత్ వైర్లు తగలడంతో చిన్నారికి తీవ్రమైన విద్యుత్ షాక్ వచ్చింది. తక్షణమే...