పాఠశాలలో అధ్యక్షా…!
పాఠశాలలో అధ్యక్షా...! పిల్లలే ప్రజాప్రతినిధులుగా... కూసుమంచి ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా మాక్ పార్లమెంట్ ఆకట్టుకున్న చిన్నారులు కాకతీయ, ఖమ్మం: విద్యార్థులే ప్రజాప్రతినిధులుగా అదరగొట్టారు. సభా పర్వాన్ని నిర్వహించి ఔరా అనిపించారు. ప్రధానమంత్రిగా , రాష్ట్ర పతి, ప్రతిపక్ష నేతలుగా చిన్నారులు ఆకట్టుకున్నారు. అసలైన పార్లమెంట్ ను తలపించేలా వాడీవేడిగా చ్చలు జరిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూసుమంచి ఉన్నత పాఠశాలలో బుధవారం మాక్ పార్లమెంట్ మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.తొలుత ప్రజాప్రతినిధుల ప్రమాణస్వీకారంతో కార్యక్రమం ప్రారంభమైంది.అనంతరం...