ఎన్నికల ఏర్పాట్లపై అదనపు క‌లెక్ట‌ర్‌ సమీక్ష

ఎన్నికల ఏర్పాట్లపై అదనపు క‌లెక్ట‌ర్‌ సమీక్ష కాకతీయ, జనగామ : జ‌న‌గామ జిల్లా రఘునాథపల్లి మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పింకేష్ కుమార్ గురువారం పరిశీలించారు. మొదటగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో ) కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్, పోలింగ్ స్టేషన్ల సిద్ధత, సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి అందుబాటు, భద్రతా చర్యలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ఎలాంటి అంతరాయం లేకుండా...