ఖమ్మంలో పోలీసుల విస్తృత తనిఖీలు
ఖమ్మంలో పోలీసుల విస్తృత తనిఖీలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునిల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో తీరుగుతున్న అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను తనిఖీ చేస్తున్నారని అన్నారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో వుంటాయన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ గస్తీ పెంచి, పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోటళ్ళు, లాడ్జీలపై పోలీసులు...