కాంట్రాక్టర్ల జేబుల్లోకి దేవుడి సొమ్ము
కాంట్రాక్టర్ల జేబుల్లోకి దేవుడి సొమ్ము ఏళ్లుగా రూ.65లక్షలు కాంట్రాక్టర్ల వద్దే బకాయి వసూలు చేసేందుకు అధికారుల విఫలయత్నం నోటీసులతోనే సరిపుచ్చుతారా.. వసూలు చేస్తారా..?! కాకతీయ, పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పదకొండేళ్లుగా కాంట్రాక్టర్లు రూ.65 లక్షలకు పైగా బకాయిలు ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు స్టేషన్ ఘాన్పూర్...