కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. రెండు గ్రామాల మాజీ సర్పంచులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నందిగామ గ్రామ మాజీ సర్పంచ్ తేజవత్ శత్రు నాయక్, అర్వయ్యపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాలోతు రామ్ లాల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ “నియోజకవర్గ అభివృద్ధి బీఆర్‌ఎస్ పాలనలోనే సాధ్యమైంది. తండాలు,...