పేదల కళ్లల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ లక్ష్యం
పేదల కళ్లల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, గీసుగొండ : పేదల కళ్లల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి, శాలువాలతో సన్మానం చేసిన ఎమ్మెల్యే రేవూరి మాట్లాడారు. ప్రజల జీవితాల్లో స్థిరత్వం, భద్రత, అభివృద్ధి అందించడం...