జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మిక తనిఖీ
జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మిక తనిఖీ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : గ్రామపంచాయతి ఎన్నికల నేపథ్యంలో తంగాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ విధానాన్ని పరిశీలించడంతో పాటు నమోదు చేసిన రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా అవగాహన చేసుకున్నారు.తనిఖీల సమయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం...