జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు గ్రామపంచాయతీ ఎన్నిక ప్రక్రియను నిలిపివేస్తూ జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్) జితేష్ వి. పాటిల్ ఆదేశాలు మేరకు మండల పరిషత్ అధికారులకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు కారణంగా జూలూరుపాడు పంచాయతీ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎన్నికల ప్రక్రియ చేపట్టరాదని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చర్యలు చేపట్టవద్దని సూచించారు. జూలూరుపాడు గ్రామ నివాసి తాళ్లూరి రామారావు...