చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్
మాజీ మంత్రి వసత్యవతి రాథోడ్ మహబూబాబాద్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కాకతీయ, మహబూబాబాద్ : చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ఉద్యమ దశలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర...