ఆశయంతో ఉన్నఅభ్యర్థులను గెలిపించండి
ఆశయంతో ఉన్నఅభ్యర్థులను గెలిపించండి కాకతీయ,జూలూరుపాడు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. జూలూరుపాడు లో శనివారం సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశం మాట్లాడుతూ జిల్లాలో ఏకగ్రీవాలు జరుగుతున్న గ్రామ పంచాయతీలలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవ ఎన్నికల వల్ల కులం,డబ్బు ప్రతిపాదన కేవలం పెత్తందారులకు ధనవంతులకు మాత్రమే రాజకీయ అవకాశం ఉంటుందని అన్నారు....