అచీవర్స్‌ స్కూల్‌లో మెగా కంటి శిబిరం

అచీవర్స్‌ స్కూల్‌లో మెగా కంటి శిబిరం కాకతీయ, కరీంనగర్‌ : అలయన్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌–137ఏ, అచీవర్స్‌ హైస్కూల్‌, వాసుదేవ హాస్పిటల్‌, సిద్ధి ఐ కేర్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం శనివారం అచీవర్స్‌ స్కూల్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలయన్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌, వాసుదేవ హాస్పిటల్‌ అధినేత డా. ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విటమిన్–ఏ లోపం, పోషకాహారం తీసుకోకపోవడం కీలక కారణాలని పేర్కొన్నారు. ఆకుకూరలు, పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు....