ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష
ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష కాకతీయ ,హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పరకాల క్రాస్ సమీపం వరంగల్ రోడ్డులో గల వాసవి ఇండస్ట్రీస్ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణంలో ఆదివారం మహా దివ్య పడిపూజ, స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారులు కాళ్ళ బసవయ్య కుమారుడు కాళ్ళ సంతోష్, అనిమ దంపతులు స్వంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్లూరు వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో పేద పండితుల మంత్రోచ్ఛారణల...