అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి అడ్లూరి పరామర్శ
అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి అడ్లూరి పరామర్శ బాధితులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో శనివారం రాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వరుసగా ఉన్న ప్లాస్టిక్ బొమ్మల దుకాణాలకు మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 26 దుకాణాలు పూర్తిగా దగ్ధమై, వ్యాపారులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్...