దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అండ
దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అండ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజలు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల చదువు, ఉపాధి, జీవనోపాధి కోసం ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తోందని తెలిపారు. వారి సంక్షేమానికి రూ.50 కోట్లు...