హైదరాబాద్ ధర్నాకు తరలిన హనుమకొండ జర్నలిస్టులు..
హైదరాబాద్ ధర్నాకు తరలిన హనుమకొండ జర్నలిస్టులు.. కాకతీయ, హనుమకొండ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ టీయూడబ్ల్యూజె (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహా ధర్నాలో హనుమకొండ జిల్లా జర్నలిస్టులు బుధవారం భారీగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సుల ద్వారా బయలుదేరిన జర్నలిస్టులు, హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జర్నలిస్టుల ఐక్యత అభివృద్ధి చెందాలని నినాదాలు చేశారు....