ఉటూరు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు
ఉటూరు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.కాంగ్రెస్‌లో చేరిన ప్రతి నాయకుడు పార్టీ బలోపేతానికి శక్తినిస్తాడని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ దశాబ్ద పాలన అవినీతి, అక్రమాలతో ప్రజలను విసిగించిందని, అందుకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు...