అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాల విద్యార్థులకు ఎస్‌జీఎఫ్

అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాల విద్యార్థులకు ఎస్‌జీఎఫ్ కాకతీయ, కరీంనగర్ : క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ క్రీడలలో బాస్కెట్బాల్ ఒకటని, విద్యార్థుల్లో ఈ క్రీడపై అవగాహన పెంచేందుకు పాఠశాల స్థాయిలోనే వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు....