గొర్రెల దొంగతనాల ముఠా అరెస్టు
గొర్రెల దొంగతనాల ముఠా అరెస్టు గీసుగొండ పోలీసులను ప్రశంసించిన ఏసీపి వెంకటేష్ కాకతీయ, గీసుగొండ: గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న గొర్రెల దొంగతనాలపై దర్యాప్తు జరిపిన గీసుగొండ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు దొంగతనాలకు నేరుగా పాల్పడగా, వారికి సహకరించిన మాంస వ్యాపారి ఒకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.1,60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మామునూరు ఏసీపి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు గతంలో ఇండ్లతాళాలు పగలగొట్టి చోరీలు,ద్విచక్రవాహన దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లారు....