ఎన్నికల కోడ్‌లో విజయోత్సవాలా?

ఎన్నికల కోడ్‌లో విజయోత్సవాలా? సీఎం రేవంత్‌పై సుంకే రవిశంకర్ ఫైర్ కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహించడం స్పష్టమైన ఉల్లంఘన అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా? అంటూ ప్రశ్నించారు.పంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో ప్రజాధనాన్ని ఖర్చు చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలను పక్కన పెట్టి రాజకీయ కార్యక్రమాలు...