ఖిలా మ్యూజియంలో దొంగలు ప‌డ్డారు

ఖిలా మ్యూజియంలో దొంగలు ప‌డ్డారు అర్కియాలజి, టూరిజం శాఖల బాధ్యతల గంద‌రగోళం ఇంకా కేసు కూడా పెట్టని రెండు శాఖల అధికారులు కాకతీయ, ఖిలావరంగల్ : పలుమార్లు ప్రారంభోత్సవాలు జరిగినా కూడా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాని ఖిల మ్యూజియంలో దొంగలు పడ్డారు. మ్యూజియం లోని విలువైన కరెంట్ సంబంధిత సామగ్రి దోచుకెళ్లిన ఘటన బయటకు వచ్చింది. సంఘటన జరిగినప్పటికీ ఇప్పటివరకు ఏ విభాగం పిర్యాదు ఇవ్వలేదు. మ్యూజియాన్ని చూసే బాధ్యత ఎవరిది అన్న గందరగోళం కారణంగా ఆర్కియాలజీ, టూరిజం శాఖలు ఒకరి...