డిసెంబర్ 14న ‘అమాట్–2025’ గణిత ఒలింపియాడ్

డిసెంబర్ 14న ‘అమాట్–2025’ గణిత ఒలింపియాడ్ అమాట్ గోడప్రతి ఆవిష్కరించిన డా. వి. నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 14న అల్ఫోర్స్ విద్యాసంస్థలు ‘అమాట్–2025’ గణిత ఒలింపియాడ్ పరీక్షను నిర్వహించనున్నాయి. వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో అమాట్ 2025 గోడప్రతిని ఆవిష్కరిస్తూ డా.వి.నరేందర్ రెడ్డి మాట్లాడారు. భారత గణిత మహానుభావుడు శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో ఈ పరీక్షను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్ఈ, స్టేట్, ఐసిఎస్ఇ...