ప్రతీ ఖర్చు లెక్కలో చూపాలి
ప్రతీ ఖర్చు లెక్కలో చూపాలి ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య చర్ల–దుమ్ముగూడెం మండలాల్లో పర్యటన కాకతీయ, భద్రాచలం : ఎన్నికల వ్యయ నియంత్రణలో భాగంగా ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య , ఎక్స్‌పెండిచర్ నోడల్ ఆఫీసర్ ఏ.వీ. రెడ్డి ఆదివారం దుమ్ముగూడెం మరియు చర్ల మండలాల్లో పర్యటనలు నిర్వహించారు. ముందుగా అధికారులు దుమ్ముగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి, పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ఎన్నికల వ్యయ నమోదు రిజిస్టర్లు, షాడో రిజిస్టర్, రసీదులు మరియు లావాదేవీల వివరాలను సమగ్రంగా పరిశీలించారు....